
తన పాత పోకిరి చిత్రనికీ తాజా ఖలేజా చిత్రానికి ఎలాంటి పోలికలు లేవని, ఇవి రెండు విరుద్దమైనవని ప్రిన్స్ మహేశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం మహేశ్ బాబు ఖలేజా చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖలేజాలో మీరు కొత్త మహేశ్ బాబును చూస్తారని, ఇందులో తాను కొత్తగా నటించడమే అందుకు కారణమని అన్నాడు. కొందరు పోకిరి చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చడం సరి కాదన్నారు.
ఈ చిత్రానికి అసలైన కథానాయకుడిని నేను కాదని, ఈ చిత్రాన్ని అంత అద్భుతంగా రావడానికి కృషి చేసిన త్రివిక్రమే ఈ చిత్రానికి అసలైన హీరో అన్నారు. చిత్రం విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా నడుస్తుందని చెప్పారు.
No comments:
Post a Comment