సూపర్‌స్టార్ మహేష్, అనుష్క జంటగా త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో ఎస్. సత్యరామమూర్తి సమర్పణలో శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్ కనకరత్న మూవీస్ పతాకంపై నిర్మించిన ‘మహేష్ ఖలేజా’ నవంబర్ 25కి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ... ‘విడుదలైన అన్ని సెంటర్స్‌లో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించి అన్ని ముఖ్య కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి పరులుగులు తీస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ చిత్రానికి మహేష్‌బాబు పెర్‌ఫార్మెన్స్ హైలైట్ అని ప్రేక్షకులంతా ప్రశంసించారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికీ రాని అద్భుతమైన షేర్స్ ‘మహేష్ ఖలేజా’ సాధించడం విశేషం’’ అన్నారు.
No comments:
Post a Comment