ఎప్పుడెప్పుడా అంటూ మొబైల్ వినియోగదారులు ఎదురుచూస్తున్న మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఇండియాలో ప్రారంభమైనది. కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబాల్ భారత్ లో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని ప్రారంభించారు. అయితే మొట్టమొదటిగా హర్యానాలో ఈ సర్విస్ ప్రవేశ పెడుతున్నట్లు ఆయన తెలియజేసారు.
ఈ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీతో ఒక వినియోగదారుడు తను ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ నెంబర్ ను వేరే (నెట్వర్క్) సర్విసులోకి సులభంగా మార్చుకునే సౌలభ్యంకలదు. 2011 జనవరి 20 నుంచి ఈ పధకం భారత దేశమంతా అమలులోకి రానున్నదని టెలికాం వర్గాలు వెల్లడించాయి.
ఈ పధకంలో మొబైల్ వినియోగదారులు (both pre-paid and post-paid) ఎవరన్నా కేవలం 19 రూపాయలకే ఒక నెట్ వర్క్ నుంచి వేరొక నెట్ వర్క్ కి మారిపోవచ్చు.
No comments:
Post a Comment