మహేష్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ డే వచ్చిన సూపర్ టాక్ కంటిన్యూ అవుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్లతో టాక్ ఇంకా స్ప్రెడ్ అవుతోంది.రికార్డ్స్ బ్రేక్ చేయటంలో మహేష్ బాబు ‘దూకుడు’ కొత్త పుంతలు తొక్కుతుంది. ఒక్క మొదటి రోజే, నైజాంలో సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం, వీకెండ్ వచ్చే సరికి మరో రికార్డ్ సృష్టించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నైజాంలో ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో సుమారు 4.6 కోట్లు వసూలు చేసింది.
ఇది రాజమౌళి మగధీర కంటే ఎక్కువ. గతంలో మగధీర నైజాంలో వసూలు చేసిన మొత్తం నాలుగు రోజులకి సుమారుగా 5.60 కోట్లు. అయితే ‘దూకుడు’ సినిమా ఒక రోజు ముందుగానే ఈ రికార్డ్ బద్దలు కొట్టింది. ఈ దూకుడు సునామిని ఆపటం ఇప్పట్లో ఆపటం అయ్యే పనిలా కనిపించటం లేదు. ఇదే విధంగా కొనసాగితే మొదటి వారం 7కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణాలో సకల జనుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆ ప్రభావ ఉంటుందని చాలా మంది భావించారు. కానీ ఇందుకు విరుద్దంగా ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకువెళ్ళడం విశేషం.
మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, సమంతా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీను వైట్ల దర్శకత్వం. గోపీచంద్, ఆచంట రామ్ మరియు అనిల్ సుంకర, 14 రీల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చగా, కెవి గుహన్.. సినిమాటోగ్రాఫర్.
No comments:
Post a Comment