
నా నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని చేయడానికి నేను రెడీ..!
నటి కాజల్ అగర్వాల్ పై సెక్సీ సమంత ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. కాజల్ చాలా టాలెంటెడ్ నటీ అని, మంచి మానవతా విలువలు కలిగిన వ్యక్తి అనీ కితాబిస్తోంది. నిజాయితీగా ఎలా ఉండాలో ఆమెను చూసి నేర్చుకున్నాను అంటోంది. ఇద్దరూ కలిసి జూ ఎన్టీఆర్ బృందావనం చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలన కానుంది. తాను చిత్రం కోసం ఎంతో ఉత్సాహంతో ఎదుచు చూస్తున్నానని చెప్పింది. పాత్ర గురించి చెప్పమంటే చెప్పకుండా దాటవేస్తూ..మంచి పాత్ర పోషించానని అంది. తక్కువ సమయంలోనే పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ‘ఏ మాయ చేసావె’ చిత్రంలోని పాత్రకంటే గ్లామర్ పాత్రలు చేస్తావా..? అని అడిగితే.. నా నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని చేయడానికి నేను రెడీ అని బదులిచ్చింది. కాగా సమంత తాజాగా మహేష్ బాబుతో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ లో పాల్గొంటానని చెప్పింది.
No comments:
Post a Comment